ఐపీఎల్ మెగా యాక్షన్ లో రెండో రోజు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. ఐపీఎల్ మాజీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కేన్ విలియంసన్.. గత సీజన్ లో రూ. 14 కోట్ల రూపాయల ధర పలికిన బ్యాటర్ డారిల్ మిచెల్ కు ఈ సారి అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. కనీస ధర రూ. 2 కోట్లతో వేలల్లోకి వచ్చిన ఈ ముగ్గురిని తీసుకోవడానికి ఏ ఒక్కరు ఆసక్తి చూపించలేదు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో వీరు కనిపించడం అసాధ్యంగానే కనిపిస్తుంది.
2024 ఐపీఎల్ సీజన్ లో కేన్ విలియంసన్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు. రూ 2 కోట్ల ప్రాథమిక ధరకు అతన్ని సొంతం చేసుకోగా పూర్తిగా విఫలమయ్యాడు. ఫిలిప్స్ కు అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇక 2023 ఐపీఎల్ మినీ వేలంలో రూ. 14 కోట్ల భారీ ధరకు డారిల్ మిచెల్ ను దక్కించుకుంటే అతను తీవ్రంగా నిరాశపరిచాడు.
Also Read : చెన్నై to ముంబై.. భారీ ధర పలికిన ధోని శిష్యుడు
New Zealand players Kane Williamson and Glenn Phillips remain unsold on Day 2 of the IPL 2025 mega auction.
— CricTracker (@Cricketracker) November 25, 2024
Follow live: https://t.co/D3KtnkUb1M#IPL2025 pic.twitter.com/2AwWsceCz3