న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తండ్రయ్యాడు. అతని భార్య సారా ఫిబ్రవరి 28 బుధవారం నాడు ఆడపిల్లకు జన్మనిచ్చారు. వీరికిది మూడో సంతానం. ఈ జంటకు ఇప్పటికే 2020లో కుమార్తె, 2022లో కుమారుడు వీరు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. మాకు మూడో బిడ్డ జన్మించింది. మా అందమైన బేబీకు స్వాగతం. చాలా గొప్పగా అనిపిస్తుంది. నీకు ప్రయాణం గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను అని విలియమ్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
విలియమ్సన్ మూడవ బిడ్డ పుట్టడానికి ముందు తన భార్యతో కలిసి ఉండటానికి ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన T20I సిరీస్ నుండి వైదొలిగాడు. కేన్ విలియమ్సన్, సారా రహీం 2015 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ జంట ఇంకా వివాహం చేసుకోలేదు. వారి మొదటి బిడ్డ, కుమార్తె మాగీ డిసెంబర్ 2020లో జన్మించింది. కొన్ని సంవత్సరాల తర్వాత మే 2022లో మగబిడ్డకు జన్మనిచ్చారు. రెండవ బిడ్డ పుట్టబోయే ముందు విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ బయో-బబుల్‌ను విడిచి పెట్టు మ్యాచ్ లకు దూరమయ్యాడు.
Also Read :టెస్టులకు వాగ్నర్ గుడ్‌బై
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమైన విలియంసన్.. రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. 2023 సీజన్ లో టోర్నీ ప్రారంభ మ్యాచ్ లోనే గాయం టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. టెస్టుల్లో టాప్ రాంక్ లో కొనసాగుతున్న కేన్.. చివరి 7 టెస్టుల్లో 7 సెంచరీలు బాది తన 32వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
Kane Williamson & his wife are blessed with a baby Girl. ❤️
— Johns. (@CricCrazyJohns) February 28, 2024
- Congratulations to both of them. pic.twitter.com/T7O40aid3g