శుక్రవారం (డిసెంబర్ 6) రోజు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఇది రెండో టెస్ట్ కాగా.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లకు ఇది రెండో టెస్ట్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ లకు ఒక సీన్ రిపీటైంది. నో బాల్ బాల్ విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టులో ఇన్నింగ్స్ 7 ఓవర్లో ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ తొలి బంతికే రాహుల్ ని ఔట్ చేశాడు.
ఆసీస్ ఫాస్ట్ బౌలర్ వేసిన ఒక అద్భుత బంతిని ఆడే క్రమంలో రాహుల్ బ్యాట్ ఎడ్జ్ అయ్యి వికెట్ కీపర్ కు క్యాచ్ వెళ్ళింది. అయితే ఈ సమయంలో అంపైర్ నో బాల్ చెక్ చేసి రాహుల్ ను నాటౌట్ గా ప్రకటించాడు. మరోవైపు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో కార్స్ బౌలింగ్ లో విలియంసన్ ఔటయ్యాడు. చెక్ చేసి అంపైర్ నో బాల్ బాల్ ఇచ్చాడు. బోలాండ్, కార్స్ ఇద్దరు కూడా లైన్ ధాటి బంతి వేశారు. అయితే రాహుల్, విలియంసన్ బతికిపోయారు. ఇదంతా 15 నిమిషాల వ్యవధిలో జరిగింది.
Also Read : సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు కష్టాలు
ఈ మ్యాచ్ లో స్టార్క్ బౌలింగ్ లో రాహుల్ ఔట్ కాగా.. కార్స్ ఎలాగైతే విలియంసన్ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 86 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. క్రీజ్ లో విలియం ఒరోర్కే(0), టామ్ బ్లండెల్(7) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులు వెనకబడి ఉంది. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 280 పరుగులకు ఆలౌట్ అయింది.
Kane Williamson and KL Rahul were both dismissed on no-balls in two separate Test matches. pic.twitter.com/IScuDzFl5V
— SportsTiger (@The_SportsTiger) December 6, 2024