న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయాలకు పొంగిపోకుండా, పరాజయాలకు కుంగిపోకుండా మైదానంలో జెంటిల్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్ లో ఎలాంటి వివాదాలు, విమర్శలు లేని అతి తక్కువ మంది క్రికెటర్లలో విలియంసన్ ఒకడు. గ్రౌండ్ లో ఎప్పుడు పెద్ద మనిషిలా ఉండే విలియంసన్ తనలోని మరో కోణాన్ని చూపించాడు.
వరల్డ్ కప్ లో ప్రస్తుతం శ్రీలంక, న్యూజీలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకోగా లంక జట్టు 70 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. మాథ్యూస్ పిచ్ మీదకు వచ్చినప్పుడు విలియంసన్ అతని దగ్గరకు వెళ్లి నీ హెల్మెట్ బాగానే ఉందిగా అని సరదాగా వ్యాఖ్యానించాడు.
పేస్ బౌలర్ బౌల్ట్ మాటలు కలిపి మాథ్యూస్ ను టీజ్ చేశారు. దీంతో ఈ సీనియర్ శ్రీలంక ఆల్ రౌండర్ నవ్వు ఆపుకోలేకపోయాడు.ఈ మ్యాచ్ కు ముందు బంగ్లాపై జరిగిన పోరులో మాథ్యూస్ టైమ్డ్-అవుట్ కారణంగా ఔటయ్యాడు. ఈ ఔట్ పై మండిపడిన మాథ్యూస్.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుపై తీవ్ర తీవ్ర విమర్శలు చేసాడు. ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్న ఈ సీనియర్ ఆల్ రౌండర్ తాను అవుట్ కాలేదని.. ఇంకా 5 సెకన్ల సమయం మిగిలే ఉందని కొన్ని స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ బంగ్లా ఆటగాళ్లతో పాటు అంపైర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.
ఇదంతా పక్కన పెడితే కేన్ విలియంసన్ పుణ్యామా అని మాథ్యూస్ నవ్వు ముఖం పట్టాడు. మొత్తానికి విలియంసన్ తనలోని మరో కోణాన్ని చూపుతూ సరదాగా టీజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది. ఇక ఈ మ్యాచ్ లో లంక జట్టు స్వల్ప స్కోర్ కే ఆలౌట్ కాగా.. మాథ్యూస్ 16 పరుగులు చేసి విఫలమయ్యాడు.