SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టేసిన డర్బన్ సూపర్ జయింట్స్

SA20: సౌతాఫ్రికా టీ20 లీగ్.. ఇద్దరు స్టార్ క్రికెటర్లను పట్టేసిన డర్బన్ సూపర్ జయింట్స్

సౌతాఫ్రికా టీ20 లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ జయింట్స్ మరింత పటిష్టంగా మారనుంది. క్లాసన్, డికాక్, నవీన్ ఉల్ హక్ , మహరాజ్  లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్న ఆ జట్టులో మరో ఇద్దరు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు చేరనున్నారు. న్యూజిలాండ్ మాజీ టీ20 కెప్టెన్ కేన్ విలియంసన్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ డర్బన్ జట్టులో చేరనున్నారు. ఈ ఇద్దరి ప్లేయర్లను తన జట్టులోకి తీసుకుంటున్నట్లు డర్బన్ సూపర్ జయింట్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 

విలియంసన్, వోక్స్ లకు ఇదే తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ కావడం విశేషం. ఇటీవలే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న కేన్.. ప్రపంచవ్యాప్తంగా జరగబోయే లీగ్ లకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. "సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్నా.. న్యూజిలాండ్ జట్టు తరపున ఆడటం నా మొదటి ప్రాధాన్యత. సౌతాఫ్రికా లీగ్ లో చేరడం ఆనదంగా ఉంది". అని విలియంసన్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ మినహాయిస్తే ఇప్పటివరకు ఈ కివీస్ స్టార్ ప్లేయర్ ఎలాంటి లీగ్ లు టీ20 ఆడలేదు. 

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ ప్రస్తుతం ఇంగ్లాండ్ కు మూడు ఫార్మాట్ లలో రెగ్యులర్ ప్లేయర్ గా మారాడు. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్.. అవసరమైతే బ్యాటింగ్ లోనూమెరుపులు మెరిపించగలడు. 2019 వన్డే వరల్డ్ కప్.. 2022 టీ 20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో వోక్స్ సభ్యుడు. సౌతాఫ్రికా టీ20 సీజన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 8 వరకు జరుగుతుంది.  ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.