Kane Williamson: న్యూజిలాండ్ తరపున ఒకే ఒక్కడు: 19 వేల పరుగుల క్లబ్‌లో విలియంసన్

Kane Williamson: న్యూజిలాండ్ తరపున ఒకే ఒక్కడు: 19 వేల పరుగుల క్లబ్‌లో విలియంసన్

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. లాహోర్‌ వేదికగా గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తన పేరిట అరుదైన రికార్డ్ లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో 27 పరుగుల వద్ద 1900 పరుగులను పూర్తి చేసుకొని న్యూజిలాండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.  విలియమ్సన్ 3 ఫార్మాట్ లలో 440 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. 

19 వేల పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. 19000 అంతర్జాతీయ పరుగులు వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (399) అగ్ర స్థానంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (432) రెండవ స్థానంలో నిలిచాడు.   బ్రియాన్ లారా (433) మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి తర్వాత 440 ఇన్నింగ్స్ ల్లో 19 వేల పరుగులను పూర్తి చేసుకున్న నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన సాధించిన 16వ ఆటగాడు విలియంసన్. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్లలో 18,995 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను అధిగమించాడు. 

ALSO READ | Champions Trophy 2025: రచీన్ రవీంద్ర మరో సెంచరీ.. సఫారీలపై కివీస్ పరుగుల వరద

అంతేకాదు ఈ మ్యాచ్ లో 10 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత న్యూజిలాండ్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు ఈ రికార్డ్ స్టీపెన్ ఫ్లెమింగ్‌ పేరిట ఉంది. ఫ్లెమింగ్ 13 ఇన్నింగ్స్‌లలో 441 ​​పరుగులు చేయగా.. విలియంసన్ ఈ రికార్డ్ అధిగమించాడు. రచీన్ రవీంద్రతో పాటు స్టార్ బ్యాటర్ విలియంసన్ (64) హాఫ్ సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ తొలి 32 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (105), విలియంసన్ (72) ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 153 పరుగులు జోడించడం విశేషం.