NZ vs ENG: స్మిత్‌తో సమానంగా: ఇంగ్లాండ్‌పై విలియంసన్ భారీ సెంచరీ

NZ vs ENG: స్మిత్‌తో సమానంగా: ఇంగ్లాండ్‌పై విలియంసన్ భారీ సెంచరీ

కొడితే కొట్టాలిరా సెంచరీ కొట్టాలి.. ఈ వాక్యం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు విలియంసన్ కు బాగా సరిపోతుంది. టెస్టుల్లో ఒక సెంచరీ కొట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కివీస్ బ్యాటర్ మాత్రం సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. సింగిల్ తీసినంత సింపుల్ గా సెంచరీలు బాదేస్తున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న కేన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్ట్ లో సెంచరీతో సత్తా చాటాడు. 

హామిల్టన్ వేదికగా సీడెన్ పార్క్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సోమవారం (డిసెంబర్ 16) మూడో రోజు ఆటలో భాగంగా విలియంసన్ 156 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. విలియంసన్ కెరీర్ లో ఇది 33 వ సెంచరీ. దీంతో అతను స్మిత్ (33) టెస్ట్ సెంచరీల రికార్డ్ ను సమం చేశాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో 36 సెంచరీలతో రూట్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న విలియంసన్ కు ఈ సిరీస్ లో ఇదే తొలి సెంచరీ. 

Also Read : మారని కోహ్లీ తీరు.. మరోసారి బలహీనతను బయట పెట్టిన కింగ్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 534 పరుగుల ఆధిక్యంలో ఉంది. విలియంసన్ (156) సెంచరీతో రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 347 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కు 204 పరుగుల ఆధిక్యం లభించింది.