Kane Williamson: చరిత్ర సృష్టించిన కేన్ ‘మామ’.. కోహ్లీ, గంగూలీలు వెనక్కి

Kane Williamson: చరిత్ర సృష్టించిన కేన్ ‘మామ’.. కోహ్లీ, గంగూలీలు వెనక్కి

న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వన్డే క్రికెట్‌లో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ట్రై సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఐదున్నరేళ్ల తరువాత సెంచరీ చేసిన ఈ కివీస్ మాజీ కెప్టెన్.. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీలను వెనక్కి నెట్టాడు.

ఈ మ్యాచ్‌లో 113 బంతుల్లో 133 పరుగులు చేసిన విలియమ్సన్.. వన్డే క్రికెట్‌లో 7000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు చేసిన తొలి బ్యాటర్. ఓవరాల్‌గా రెండవ బ్యాటర్. ప్రోటీస్‌తో మ్యాచ్‌కి ముందు 158 ఇన్నింగ్స్‌లలో 6868 పరుగులు చేయగా.. 7000 మైలురాయిని చేరుకోవడానికి 132 పరుగులు అవసరం. అటువంటిది కేన్ ‘మామ’ ఒక పరుగు ఎక్కువ కొట్టి 7వేల మార్క్ దాటాడు. 

వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు

1. హషీమ్ ఆమ్లా: 150 ఇన్నింగ్స్‌లు
2. కేన్ విలియమ్సన్: 159 ఇన్నింగ్స్‌లు
3. విరాట్ కోహ్లీ: 161 ఇన్నింగ్స్‌లు
4. ఏబీ డివిలియర్స్: 166 ఇన్నింగ్స్‌లు
5. సౌరవ్ గంగూలీ: 174 ఇన్నింగ్స్‌లు

ఇక ట్రై సిరీస్ విషయానికొస్తే.. రెండు విజయాలతో కివీస్ జట్టు ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా.. ఇప్పుడు పాకిస్తాన్-  దక్షిణాఫ్రికా అమీ తుమీ తేల్చుకోనున్నాయి. బుధవారం(ఫిబ్రవరి 12) ఈ ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.