IND vs NZ: టీమిండియాకు తలనొప్పిగా కివీస్ వెటరన్.. స్పిన్నర్లపై విలియంసన్‌కు టాప్ రికార్డ్

IND vs NZ: టీమిండియాకు తలనొప్పిగా కివీస్ వెటరన్.. స్పిన్నర్లపై విలియంసన్‌కు టాప్ రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లతో పాటు క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రోహిత్ సేన టైటిల్ గెలవడం ఖాయమని చాలామంది జోస్యం చెప్పేశారు. అయితే ఒక భయం మాత్రం భారత జట్టును వెంటాడుతుంది. అదేంటో కాదు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ విలియంసన్ అపారమైన అనుభవం. 

టీమిండియా బలమంతా స్పిన్నర్లే. దుబాయ్ లోని పిచ్ లో స్లో గా ఉండడంతో స్పిన్నర్లు వికెట్ల వర్షం కురిపించారు. ముగ్గురు స్పిన్నర్లు సరిపోరు అన్నట్టుగా భారత్ చివరి రెండు మ్యాచ్ ల్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి విజయాలను అందుకుంది. ఫైనల్లో కూడా నలుగురు స్పిన్నర్లతో రోహిత్ సేన తుది జట్టుతో ఆడడం దాదాపుగా ఖాయమైంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్ లతో కూడిన స్పిన్ అంటే ఏ జట్టుకైనా సవాలే. కానీ న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ విలియంసన్ మాత్రం స్పిన్నర్లను బయపెడుతున్నాడు. 

స్పిన్నర్లపై అద్భుత రికార్డ్ కలిగి ఉన్న కేన్.. మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ పై సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. వన్డే కెరీర్ లో విలియంసన్ కు స్పిన్నర్లపై అదిరిపోయే రికార్డ్ ఉంది. ఇప్పటివరకు తన వన్డే కెరీర్ లో స్పిన్నర్లపై 47 సగటుతో 2952 పరుగులు చేశాడు. అతని 86 స్ట్రైక్ రేట్‌తో స్పిన్నర్లపై బ్యాటింగ్ చేయడం విశేషం. కేన్ కుదురుకుంటే భారత స్పిన్నర్లకు కష్టాలు తప్పవు. భారత్ పై   జరిగిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన లీగ్ మ్యాచ్ లో విలియంసం 81 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అతనికి ఎవరైనా సహకరించి ఉంటే కివీస్ విజయం సాధించి ఉండేది. ఏదైనా ఫైనల్లో విలియంసన్ వికెట్ తీయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ పై కివీస్ దే పై చేయి. ఈ మ్యాచ్ లో భారత్ ను న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు ఫైనల్స్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటానికి భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్ గెలిచిన రెండు ఐసీసీ టోర్నీలో భారత్ పైనే గెలవడం విశేషం.