Kane Williamson: నా కెరీర్‌లో ఆ ముగ్గురిని ఔట్ చేయడం కష్టంగా అనిపించేది: విలియంసన్

Kane Williamson: నా కెరీర్‌లో ఆ ముగ్గురిని ఔట్ చేయడం కష్టంగా అనిపించేది: విలియంసన్

ప్రస్తుత క్రికెట్ లో ఫ్యాబ్ 4 ఆటగాళ్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ ఒకడు. ఫార్మాట్ ఏదైనా నిలకడగా రాణించగల అతికొద్ది మంది ఆటగాళ్లలో కేన్ ఒకడు. 1900 పరుగులను పూర్తి చేసుకొని న్యూజిలాండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. విలియమ్సన్ 3 ఫార్మాట్ లలో 440 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇదిలా ఉంటే విలియంసన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. తన అనుభవంతో జట్టుకు టైటిల్ అందించాలని ఆరాటపడుతున్నాడు. 

ఫైనల్ మ్యాచ్ కు ముందు విలియంసన్ కు చిన్న ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ ఆడాడు. ఇందులో భాగంగా తన క్రికెట్ కెరీర్ లో ప్రత్యర్థులుగా ఎవరిని ఔట్ చేయడం కష్టమని అడిగారు. ఇందుకు విలియంసన్ భారత దిగ్గజ క్రికెటర్లు కోహ్లీ, సచిన్ తో పాటు ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేర్లు చెప్పాడు. ఈ ముగ్గురు తాను ఆడుతున్న సమయంలో చాలా ఇబ్బంది పెట్టారని విలియంసన్ అన్నాడు. ఎదుర్కొన్న కఠిన బౌలర్ ఎవరని అడిగితే టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పాడు. ఒకే బ్యాటర్ పేరు చెప్పమని అడిగితే కోహ్లీ అనేశాడు.

ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో విలియంసన్ 19 వేల పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. 19000 అంతర్జాతీయ పరుగులు వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (399) అగ్ర స్థానంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (432) రెండవ స్థానంలో నిలిచాడు.   బ్రియాన్ లారా (433) మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి తర్వాత 440 ఇన్నింగ్స్ ల్లో 19 వేల పరుగులను పూర్తి చేసుకున్న నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన సాధించిన 16వ ఆటగాడు విలియంసన్.

ALSO READ | IND vs NZ Final: రూల్స్ బ్రేక్ చేస్తే 22 లక్షల జరిమానా.. ఫైనల్‌కు ముందు దుబాయ్ పోలీసులు ఫ్యాన్స్‌కు వార్నింగ్  

అంతేకాదు ఈ మ్యాచ్ లో 10 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత న్యూజిలాండ్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు ఈ రికార్డ్ స్టీపెన్ ఫ్లెమింగ్‌ పేరిట ఉంది. ఫ్లెమింగ్ 13 ఇన్నింగ్స్‌లలో 441 ​​పరుగులు చేయగా.. విలియంసన్ ఈ రికార్డ్ అధిగమించాడు. ఇప్పటివరకు ఈ కివీస్ దిగ్గజం 105 టెస్ట్ మ్యాచ్ ల్లో 9276 పరుగులు.. 172 వన్డేల్లో 7225 పరుగులు చేశాడు.