న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన దృష్ట్యా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నారు. కేన్ ఇప్పటికే టెస్టు కెప్టెన్సీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే న్యూజిలాండ్ వెనుదిరగడం గమనార్హం.
ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ గ్రూప్-స్టేజ్‌లోనే టీ20 ప్రపంచకప్ నుండి వైదొలగడం అందర్ని షాక్ కు గురి చేసింది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో కివీస్ జట్టు గ్రూప్ దశ దాటి ముందుకు వెళ్లలేకపోవటం ఇదే తొలిసారి.
అయితే విలియమ్సన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అతని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమేనని అంటున్నారు. విలియమ్సన్ 91 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లకు కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కాలంలో కివీ జట్టు 47 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు గెలిచింది.