కొడుకు ఫోటో షేర్ చేసిన కేన్ విలియమ్సన్

సన్ రైజర్స్ హైదరాబాద్, న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఇటీవలే జన్మించిన తన కొడుకు ఫోటోను ఇస్టాగ్రామ్లో షేర్ చేసి మురిసిపోతున్నాడు. ఐపీఎల్ 2022లో ఆడుతున్న సమయంలో కేన్ వైఫ్ సారా రహీమ్ ప్రసవం కోసం క్రై్స్ట్ చర్చ్లోని హాస్పిటల్లో చేరింది. ఈ విషయం తెలియడంతో కేన్ విలియమ్సన్ హుటాహుటిన న్యూజీలాండ్కు బయలుదేరాడు.  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే కేన్ స్వదేశానికి పయనమయ్యాడు. ఆ తర్వాత సారా రహీమ్  మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భార్య కుమారుడిని ఎత్తుకున్న ఫోటోను కేన్ షేర్ చేశాడు.  లిటిల్ మ్యాన్‌కు స్వాగతం పలుకుతున్నామంటూ కామెంట్ చేశాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kane Williamson (@kane_s_w)

సారా ఒడిలో ఉన్న ఆ శిశువుతో కేన్ కుమార్తె మ్యాగీ ఆడుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్గా మారింది.  ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కేన్ విలియమ్సన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.