భారత్ తో జరగనున్న వన్డే వరల్డ్ కప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా.. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ పరిస్థితి గందరగోళంగా ఉంది. గాయం నుంచి ఇంకా కోలుకోకుండానే ఈ స్టార్ బ్యాటర్ ని వరల్డ్ కప్ కి ఎంపిక చేశారు. ఐపీఎల్ లో గాయపడిన తర్వాత మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న విలియమ్సన్.. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఈ రోజు పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడుతున్నాడని తెలిసి అభిమానులు పండగ చేసుకున్నారు.
ALSO READ : ODI World Cup 2023: నా వ్యూహం అదే.. కోహ్లీని ఔట్ చేయడానికి 5 బంతులు చాలు: నెదర్లాండ్స్ బౌలర్
ఇక అంతా సెట్ అయిందని భావించిన తరుణంలో ఇంగ్లాండ్ తో వరల్డ్ కప్ తొలి మ్యాచుకు విలియమ్సన్ అందుబాటులో ఉండడని న్యూజిలాండ్ క్రికెట్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే వరల్డ్ కప్ తొలి మ్యాచుకు దూరమైనా.. నేడు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరగబోయే వార్మప్ మ్యాచ్ కేన్ ఆడుతున్నాడు. కానీ బ్యాటర్ గా మాత్రమే ఈ మ్యాచులో బరిలోకి దిగుతున్నాడు. అదే విధంగా సోమవారం తిరువనంతపురంలో దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్ రెండూ కేన్ చేసే అవకాశం ఉంది.
ఇక ఈ నెల 9న నెదర్లాండ్స్ తో జరిగే మ్యాచుకు విలియమ్సన్ అందుబాటులో రావచ్చని తెలుస్తుంది. విలియమ్సన్ లాంటి బ్యాటర్ తొలి మ్యాచులో అందుబాటులో లేకపోవడంకివీస్ కి గట్టి ఎదురు దెబ్బె అని చెప్పాలి. బ్యాటర్ గా, కెప్టెన్ గా న్యూజీలాండ్ జట్టుకి ఎన్నో సంచలన విజయాలను అందించిన కేన్.. 2019 లో జరిగిన వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుని సెమీస్ కి చేర్చడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.