పుణె : గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇండియాతో రెండో టెస్టుకూ అందుబాటులో ఉండటం లేదు. కివీస్ బోర్డు మంగళవారం ఈ విషయం వెల్లడించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గాయపడిన కేన్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ‘విలియమ్సన్ గాయం క్రమంగా తగ్గుతోంది. అయితే వంద శాతం ఫిట్నెస్ రాలేదు.
అతన్ని మేం పూర్తిగా పరిశీలిస్తున్నాం. రాబోయే రోజుల్లో పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వస్తాడు. ’ అని కివీస్ బోర్డు పేర్కొంది. గురువారం నుంచి ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.