
ఓ వైపు ఐపీఎల్ 2025 క్రికెట్ అభిమానులను అలరిస్తుంటే.. మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 11) పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 11 న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 18న ఫైనల్ తో ముగుస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇస్లామాబాద్ యునైటెడ్ బరిలోకి దిగుతుంది. టోర్నీ తొలి మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ తో ఇస్లామాబాద్ యునైటెడ్ తలపడనుంది. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మెగా లీగ్ కు ముందు కరాచీ కింగ్స్ కు ఒక బ్యాడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియంసన్ ప్రారంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ లో విలియంసన్ తొలిసారి ఆడనున్నాడు. కరాచీ కింగ్స్ ఈ కివీస్ స్టార్ ను దక్కించుకుంది. కేన్ ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు. ఐపీఎల్ కామెంట్రీ చేస్తూ బిజీగా మారాడు. దీంతో పాటు అతనికి భుజం గాయం వేధిస్తుంది. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో విలియంసన్ గాయపడ్డాడు. దీంతో కేన్ కోలుకోవడానికి మరికొంత సమయం పడుతున్నట్టు సమాచారం. దీని ప్రకారం తొలి ఐదు మ్యాచ్ లకు విలియంసన్ పాకిస్థాన్ సూపర్ లీగ్ కు దూరం కానున్నాడు.
తొలి ఐదు మ్యాచ్ లకు విలియంసన్ అందుబాటులో ఉండడని.. అయితే క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగే ఆరవ మ్యాచ్‌కు ముందు జట్టులో చేరే అవకాశం ఉందని కరాచీ కింగ్స్ యజమాని సల్మాన్ ఇక్బాల్ అధికారికంగా చెప్పాడు. విలియంసన్ తో పాటు ఇస్లామాబాద్ యునైటెడ్ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్.. న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
Kane Williamson to miss 5 PSL Matches due to IPL 👎👎 pic.twitter.com/KiNoCe218g
— ٰImran Siddique (@imransiddique89) April 8, 2025
కరాచీ కింగ్స్ జట్టు:
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే (ప్లాటినం), జేమ్స్ విన్స్, హసన్ అలీ, ఖుష్దిల్ షా (డైమండ్), షాన్ మసూద్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ మరియు అమీర్ జమాల్ (గోల్డ్), అరాఫత్ మిన్హాస్ (బ్రాండ్ అంబాసిడర్), టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్ మరియు మీర్ హంజా (సిల్వర్), ఫవాద్ అలీ, రియాజుల్లా (ఇద్దరూ ఎమర్జింగ్), ఒమైర్ బిన్ యూసుఫ్, కేన్ విలియమ్సన్, మొహమ్మద్ నబీ, మీర్జా మమూన్ (సప్లిమెంటరీ).