IND vs NZ Final: విలియంసన్ స్థానంలో చాప్ మన్.. ఫీల్డింగ్‌కు రాని కేన్ మామ

IND vs NZ Final: విలియంసన్ స్థానంలో చాప్ మన్.. ఫీల్డింగ్‌కు రాని కేన్ మామ

ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. దుబాయ్ వేదికగా ఇండియాతో జరుగుతున్న ఫైనల్లో  బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా బౌలింగ్ లో నిరాశపరిచారు. టీమిండియా ఓపెనర్లను కట్టడి చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో ఇన్నింగ్స్ లో గ్రౌండ్ లోకి రాలేదు. కేన్ కు పక్క గాయంతో ఇబ్బందిపడుతున్నటు సమాచారం.  

విలియంసన్ స్థానంలో మార్క్ చాప్ మన్ ఫీల్డింగ్ కు వచ్చాడు. ఫైనల్ కు విలియంసన్ సేవలు ఫీల్డ్ లో అందుబాటులో లేకపోవడం  న్యూజిలాండ్ కు మైనస్ గా మారనుంది. ఈ మ్యాచ్ లో కేన్ బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. కేవలం 11 పరుగులే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ALSO READ | IND vs NZ Final: రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ.. పవర్ ప్లే లో ఇండియాకు సూపర్ స్టార్ట్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే 252 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది.  రోహిత్ శర్మ (50), గిల్ (10) క్రీజ్ లో ఉన్నారు. భారత్ గెలవాలంటే 39 ఓవర్లలో మరో 186 పరుగులు చేయాలి. చేతిలో 10 వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.