డబ్బుల్లేక ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చిందంటూ హీరోయిన్ ఎమోషనల్..

డబ్బుల్లేక ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చిందంటూ హీరోయిన్ ఎమోషనల్..

బాలీవుడ్ క్వీన్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ అనే చిత్రం జనవరి 17న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి రోజే  వరల్డ్ వైడ్ రూ.4 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసి డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమాని బ్యాన్ చేయడంతో ఈ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. అయితే ఇటీవలే కంగనా రనౌత్ ఓ ఇంటర్వూలో ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలని ఆడియన్స్ తో పంచుకుంది.

ఇందులో భాగంగా ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఓపెన్ అయ్యింది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామాలో ఉండటం, అలాగే కొన్ని కాంట్రవర్సిలతో ముడిపడి ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఓటిటి ప్లాట్ఫార్మ్స్ ఎవరూ కూడా  కొనడానికి ముందుకు రాలేదని చెప్పుకొచ్చింది. దీంతో షూటింగ్ కి డబ్బులేక చివరికి ముంబైలో ఉన్నటువంటి తన ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి షూటింగ్ పూర్తి చేసానని ఎమోషనల్ అయ్యింది. సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికెట్ జారీ విషయంలో అభ్యంతరాలు తెలపడంతో మళ్ళీ కొన్ని సన్నివేశాల్ని ఎడిట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

ALSO READ | Ram Gopal Varma: సత్యపై ఒట్టేసి చెబుతున్నా.. అలా చేయకపోతే నన్ను కాల్చేయ్

ఇక తానంటే గిట్టని కొందరు ఇండస్ట్రీలో తన గురించి ఉన్నవిలేనివి కల్పించి తప్పుడు ప్రచారాలు చేయించారని ఈ క్రమంలో సైకో, స్టాకర్ అంటూ ముద్రలు వేశారని వాపోయింది. దీనికోసం సెపరేట్ గా పీఆర్ టీమ్ ని కూడా నియమించుకున్నారని అంతగా తనపై కోపం పెంచుకున్నారని చెప్పుకొచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా దాదాపుగా రూ.60 కోట్లు బడ్జెట్ వెచ్చించి ఈ సినిమాని కంగనా రనౌత్ నిర్మించడమేకాకుండా దర్శకత్వం కూడా వహించింది. ఇప్పటివరకూ 3 రోజుల్లో రూ.10.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలోని క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే  అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే మరియు దివంగత నటుడు సతీష్ కౌశిక్ తదితరులు నటించారు.