Emergency Box Office: ఎమర్జెన్సీ బాక్సాఫీస్ వసూళ్లు.. రూ.25 కోట్ల బడ్జెట్, ఫస్ట్ డే రెస్పాన్స్తో గట్టెక్కుతుందా?

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించి, డైరెక్ట్ చేసిన మూవీ ఎమర్జెన్సీ (Emergency). వరుస వివాదాల్లో చిక్కుకోని ఎట్టకేలకు శుక్రవారం జనవరి 17న థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1975లో భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా కంగనా ఈ సినిమాని తెరకెక్కించింది.

ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన కంగనా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ5 తో కలసి సంయుక్తంగా నిర్మించింది. రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వస్తుండటంతో ఫస్ట్ డే బాక్సఫీస్ ఎలా ఉంది? కంగనా పొలిటిక‌ల్ డ్రామా ఎలాంటి సక్సెస్ అందుకోనుంది? అనే వివరాలు చూద్దాం.

Sacnilk ప్రకారం:

ఎమర్జెన్సీ మూవీ మొదటి రోజున రూ.2.35 కోట్లు నెట్ వసూలు చేసింది. కంగనా రనౌత్ సోలోగా వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఎమర్జెన్సీకి వచ్చిన ఓపెనింగ్ అత్యధికంగా నిలిచింది.

అందులో సర్వేష్ మేవారా దర్శకత్వం వహించిన తేజస్ మూవీకి రూ.1.25 కోట్లు, 2022లో రజనీష్ ఘై దర్శకత్వం వహించిన ధాకడ్ మూవీకి రూ.1.2 కోట్లు, 2021లో జె జయలలిత జీవితంపై వచ్చిన తలైవి మూవీ రూ.1.46 కోట్లు రాబట్టింది.ఇక ఈ సినిమాలతో పోలిస్తే ఎమర్జెన్సీ మూవీకి మొదటి రోజున రూ.2.35 కోట్లు రావడంతో బెస్ట్ ఓపెనింగ్ సాధించింది. 
 
జనవరి 17న ఎమర్జెన్సీ మూవీకి హిందీ ఆక్యుపెన్సీ 19.26%గా నమోదైంది. అయితే, ఈ మూవీకి చెన్నైలో 25% ఆక్యుపెన్సీతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం విశేషం. ఇకపోతే ముంబయిలో 23.75% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. మొత్తంగా మార్నింగ్ షోలు కేవలం 5.98%, మధ్యాహ్నం షోలు 13.95%, సాయంత్రం షోలు 20.86%, నైట్ షో 36.25%  ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది.