ఎమర్జెన్సీ (Emergency) చిత్రం వివాదాల్లో చిక్కుకోవడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రస్టేట్ అవుతున్నారు. ఈ సినిమా కోసం ముంబైలో ఉన్న తన బంగ్లాను కంగనా అమ్మకానికి పెట్టిందనే వార్తలు వెలువడ్డాయి. 2017లో ఈ బంగ్లాను కొనుగోలు చేసింది. తాజాగా రూ. 32 కోట్లకు ఈ బంగ్లాను విక్రయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే..
ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ బ్రేకులు వేసిన విషయం తెలిసిందే. ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ సెన్సార్ బోర్డుకి ఫిర్యాదులు రావడంతో సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే కంగన మాట్లాడుతూ "సినిమాల కంటే సెన్సార్ బోర్డు అవసరం ఓటీటీ వేదికలకే ఎక్కువ ఉంది. డబ్బు చెల్లిస్తే ఎలాంటి కంటెంట్కు అయినా యాక్సిస్ ఇస్తారు. అందులో పిల్లలు ఏం చూస్తున్నారనేదే భయమేస్తుంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయం పై నేను మాట్లాడాను' అని కంగన అభిప్రాయపడ్డారు.
Also Read :- హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా ఇద్దరు టాప్ తెలుగు హీరోయిన్లు..!
1975 సంవత్సరంలో ఇండియాలో విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కంగనా దివంగత ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాను కంగనానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. వివావాదాస్పద కథతో వస్తున్న ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూవస్తోంది.