బషీర్ బాగ్, వెలుగు: ఎమర్జెన్సీ సినిమాలో సిక్కులను తీవ్రవాదులతో పోల్చారని ఆరోపిస్తూ గౌలిగూడా గురు ద్వార్ వద్ద బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిక్కు సమాజ్ప్రతినిధులు మాట్లాడుతూ.. వెంటనే కంగనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ సినిమాను నిషేధించాలని, లేకపోతే థియేటర్ల దగ్గర జరిగే హింసకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రధాని కంగనాను బీజేపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.