ఆమెను కూడా నిర్భయ దోషులలాగే జైళ్లో పెట్టాలి

సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్‌పై, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిర్భయ దోషులను ఆమె తల్లి ఆశాదేవి క్షమించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన సూచనను బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తప్పుబట్టారు. ఇందిరాను కూడా ఆ దోషుల వలే జైళ్లో ఉంచాలని ఆమె అన్నారు. ఆమెలాంటి వాళ్లే ఇటువంటి రాక్షసులకు జన్మనిస్తారని ఆమె అన్నారు. తన కొత్త సినిమా పంగా కోసం ప్రమోషన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఆ ప్రమోషన్‌లో.. ఇందిరా జైసింగ్, నిర్భయ తల్లికి చేసిని సూచన గురించి ఓ విలేకరి అడిగాడు. దానికి తీవ్ర స్థాయిలో ఆమె స్పందించారు.

‘ఇందిరా జైసింగ్‌ను కూడా ఆ నలుగురు దోషులలాగే కొన్నిరోజుల పాటు జైలులో ఉంచాలి. అటువంటి వారిపై జాలి చూపే వాళ్లే ఇటువంటి రాక్షసులకు, హంతకులకు జన్మనిస్తారు’ అని ఆమె అన్నారు.

నిర్భయపై 2012లో జరిగిన సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని క్షమించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ జనవరి 17న నిర్భయ తల్లి ఆశాదేవిని కోరారు. నలుగురు దోషులను ఉరితీసే తేదీని ఢిల్లీ కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఆశా దేవి తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ఇందిరా ఈ అభ్యర్థనను ట్విట్టర్‌లో చేశారు. ఇందిరా సూచనపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. నిర్భయ తల్లిదండ్రులు కూడా ఇందిరా సూచనను తప్పుబట్టి, తమకు క్షమాపణ చెప్పాల్సిందిగా వారు కోరారు.

For More News..

క్షణాల్లో వాటర్‌ట్యాంక్ ఎలా కూలిందో చూడండి..

వరల్డ్ రికార్డ్: 75 ఏళ్ల వయసులో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా..

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’