‘ఆర్ఆర్ఆర్’పై కంగనా రనౌత్ ప్రశంసలు

ముంబై: గత శుక్రవారం విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ మల్టీస్టార్ మూవీకి ప్రేక్షకులతోపాటు విమర్శకుల నుంచి మంచి అప్లాజ్ వస్తోంది. రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్.. తనకూ బాగా నచ్చిందంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. సినిమాను విజువల్ ఫీస్ట్ గా తీసిన జక్కన్నపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆర్ఆర్ఆర్ ను ఫ్యామిలీతో కలసి చూశానని.. మూవీ టీమ్ కు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దేశభక్తిపై రూపొందించిన ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. 

‘ఆర్ఆర్ఆర్ కు ఎలాంటి ప్రచారం అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. మంచి ప్రేక్షకాదారణను దక్కించుకుంటూ పాత రికార్డులను తిరగరాస్తోంది. దేశభక్తిని పెంపొందిస్తూ, ఐక్యతా భావాన్ని నింపుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన పోరాటయోధులపై మరిన్ని చిత్రాలు రావాలి. వెలుగులోకి రాని స్వాతంత్ర్య సమరయోధుల గురించి అందరికీ తెలియజెప్పాలి. వీరి గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియా బయటకు చెప్పదు’ అని కంగనా చెప్పారు. అత్యంత విజయవంతమైన భారతీయ సినీ కథకుల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరని.. 80 ఏళ్ల వయసులోనూ ఆయన బిజీ రైటర్ గా కొనసాగడం గొప్ప విషయమన్నారు. విజయేంద్ర ప్రసాద్ ప్యాషన్ తో నిండిన వ్యక్తి అని.. సినీ పరిశ్రమతోపాటు యువతకు స్ఫూర్తిని ఇచ్చే అలాంటి వారి అవసరం  ఉందన్నారు. ‘ఆర్ఆర్ఆర్ లో తారక్, చరణ్ లు అద్భుతంగా నటించారు. ఇక డైరెక్టర్ రాజమౌళిని ఎంత పొగిడినా తక్కువే’ అని కంగనా వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు జక్కన్నకు ఆమె థ్యాంక్స్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం:

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్

రష్యా ఆయిల్‌‌‌‌ కొంటున్నాం

గ్రూప్​–1 నోటిఫికేషన్​కు మరో వారం టైం