మండి ఎంపీ, బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ విడుదలకు ముందు వివాదంలో పడింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. సెప్టెంబర్ 6న కంగనా దర్శకత్వంలో ఆమె నటించిన ఎమర్జెన్సీ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ఆమెకు సిక్కు తీవ్రవాద గ్రూపు నుంచి బెదిరింపు వీడియో మెసేజ్ లు వచ్చాయి. కంగనాకు వచ్చిన బెదిరింపు వీడియోను ఎక్స్ లో షేర్ చేసి.. చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
Please look in to this @DGPMaharashtra @himachalpolice @PunjabPoliceInd https://t.co/IAtJKIRvzI
— Kangana Ranaut (@KanganaTeam) August 26, 2024
వీడియోలో ఓ వ్యక్తి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. ‘చరిత్ర మార్చబడదు. సినిమాలో సిక్కులను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తే, సినిమాలో ఏ సన్నివేశం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. సత్వంత్ సింగ్ మరియు బియాంత్ సింగ్ ఎవరో గుర్తుంచుకోండి. జో హుమే ఉంగ్లీ కర్తే హై, వో ఉంగ్లీ హై చట్కా దేతే హై హమ్... అగర్ హమ్ సర్ కత్వా సక్తే హై తో సర్ కాత్ భీ సక్తే హై,” అని వీడియోలో ఓ వ్యక్తి కంగనాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వీడియోలో మాట్లాడిన ఓ వ్యక్తి తనను తాను సిక్ మాత్రమే కాదని.. ఓ భారతీయుడిగా, మరాఠీగా చెప్పుకున్నాడు. మహారాష్ట్ర వస్తే చెప్పులతో మీకు స్వాగతం చెప్తామని కంగనా రనౌత్ తో చెప్పాడు.
మీరు తీసిన సినిమాలో ఖలిస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేను టెర్రరిస్ట్ గా చూపిస్తే.. మీరు ఎవరి మీద సినిమా తీశారో.. ఆమె పరిస్థితి ఏం అయిందో గుర్తుపెట్టుకోండి. సంత్జీకి మా తలను అర్పించడానికి మేము సిద్ధంగా ఉంటాం.. అలాగే ఇతరులను కూడా చంపేయడానికి వెనుకాడమంటూ బెదిరిస్తూ ఓ వీడియో తీసి ఎంపీ కంగనా కు పంపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
భింద్రావాలే ఒక ఖలిస్తానీ తీవ్రవాది, ఆపరేషన్ బ్లూ స్టార్‌లో చంపబడ్డాడు. ఆ తర్వాత ఇందిరా గాంధీ యొక్క బాడీగాడ్స్ సత్వంత్ సింగ్ మరియు బియాంత్ సింగ్ ఆమెను అక్టోబర్ 31, 1984న హత్య చేశాడని కంగనా రనౌత్ ఎక్స్ లో రాసి.. ఇది ఒక సారి పరిశీలించడి అంటూ మహారాష్ట్ర , హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు ట్యాగ్ చేసింది.