మీరు చెప్పినట్లే మా సినిమాలో.. ఆ సీన్స్ అన్నీ కట్ చేస్తాం : కంగనా రనౌత్

మీరు చెప్పినట్లే మా సినిమాలో.. ఆ సీన్స్ అన్నీ కట్ చేస్తాం : కంగనా రనౌత్

బాలీవుడ్ ప్రముఖ నటి మరియు నిర్మాత కంగనా రనౌత్ ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా సెన్సార్ వివాదంలో చిక్కుకోవడంతో విడుదల ఆగిపోయింది. దీంతో చిత్ర యూనిట్ సెన్సార్ వివాదంలో బాంబే హైకోర్టుని ఆశ్రయించింది.

ఈ క్రమంలో సిబిఎఫ్‌సి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఎమర్జెన్సీ చిత్రంలో దాదాపుగా 11కి పైగా అభ్యంతరకర సన్నివేశాకలు ఉన్నాయని కోర్టుకి తెలిపింది.

ఇరువురి వాదనలు విన్న కోర్టు సిబిఎఫ్‌సి తెలిపిన అభ్యంతర సన్నివేశాలను తొలగించిన తర్వాత  సినిమా విడుదల చేసుకోవచ్చని చిత్ర యూనిట్ కి సూచించింది. దీంతో ఎమర్జెన్సీ చిత్రంలో సిబిఎఫ్‌సి అభ్యంతరం తెలిపిన సన్నివేశాలని తొలగించడానికి  కంగనా రనౌత్ అంగీంకరించినట్లు ఆమె తరుపు న్యాయవాదులు తెలిపారు. 

ALSO READ | RaaMachaMacha: గేమ్ ఛేంజర్ రా మచ్చా మచ్చా సాంగ్ రిలీజ్.. తమన్ బీట్కి చరణ్ కుమ్మేశాడుగా!

అయితే సన్నివేశాలను గుర్తించి ఎడిటింగ్ చెయ్యడానికి మరింత సమయం కావాలని గడువు కోరినట్లు వెల్లడించారు. దీంతో హైకోర్టు అక్టోబర్ 3వ తేదీకి విచారణ వాయిదా వేసింది.  అలాగే ఇరు పక్షాలు సరైన సూచనలు చేయాల్సిందిగా కోరింది.

ఈ విషయం ఇలా ఉండగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో పంజాబ్ కి చెందిన శిరోమణి అకాలీ దళ్‌తో సహా కొన్ని సిక్కు సంస్థలు ఎమర్జెన్సీ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

అలాగే ఈ చిత్రం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరియు చరిత్ర ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపణలు చేస్తూ వెంటనే విడుదల నిలిపివేయాలని కోరారు.