బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) తరుచూ ఎదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినీ, రాజకీయ అంశాలపై స్పందిస్తూ.. ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్నారు. ఇక ఇటీవల ఢిల్లీ రాంలీలా మైదానంలో రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగనా రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆమె ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావడాన్ని ప్రస్తావిస్తూ.. ఓ నెటిజన్ గతంలో ఆమె ధరించిన బికినీ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫోటోపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు.. SPG గాసిప్ ప్రకారం కంగనా తరచు ప్రయాణించే వ్యక్తి. ఎందుకు SPG కబుర్లు చెప్పాలి? ఎందుకంటే ఆ సంస్థ కంగనా కోసం ఎక్కువగా పని చేస్తుంది. రాంలీలా లో రావాణా దహనం కోసం ఆమెను ముఖ్య అతిథిగా పిలవడమే అందుకు నిదర్శనం. SPG అనేది ఒక గౌరవం లేని సంస్థ.. అని రాసుకొచ్చారు.
According to SPG gossip she is a “frequent flyer”. Why should SPG gossip? Because of the organisation is overworked. Her being made chief guest in the Ramlila final day is the organisation’s conduct unbecoming of respect for Maryada Purushottam. https://t.co/NYqXePl8Pj
— Subramanian Swamy (@Swamy39) October 26, 2023
ఆ ట్వీట్ కు రిప్లయ్ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కంగనా.. నా స్విమ్ సూట్ ఫోటో చూపిస్తూ ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే.. మీ వక్రబుద్ధి ఏంటో అర్థమవుతోంది. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం నా శరీరం మాత్రమే అని మీరు చెబుతున్నారు కానీ.. హిందీ సినీ ఇండస్ట్రీలో నేనొక నటిని, రచయితని, దర్శకురాలిని, నిర్మాతని, విప్లవ రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ను. నాకు బదులుగా భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా అర్హుడైన ఎవరైనా యువకుడు ఉంటే అతను కూడా శరీరాన్ని అమ్ముకున్నాడని అనగలరా?. స్త్రీ అంటే కేవలం సెక్స్ కోసం మాత్రమే కాదు.. వారికి మెదడు, గుండె, చేతులు, కాళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి మిస్టర్ సుబ్రమణియన్ ఎందుకు కాదు.. అంటూ సాలిడ్ కౌంటర్ ఇచ్చారు కంగనా. ప్రస్తుతం ఈ ఇద్దరికీ సంబందించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.