
హిమాచల్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపి కంగనా రనౌత్ మండిపడ్డారు. ఇంట్లో ఎవరు లేకున్నా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు ఎలా వేశారని ఫైర్ అయ్యారు. ఎవరులేని ఇంటికి అంత బిల్లు రావడం చూసి షాకయ్యా అని అన్నారు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటంటూ.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంగనా.
ఇటీవల కంగనా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమానికి హాజరైన కంగాన.. విద్యుత్ బిల్లు గురించి మాట్లాడారు. అధిక బిల్లుపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆమె తూర్పార బట్టారు. మనాలిలో ఉన్న నా ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. గత కొన్ని రోజులుగా నేను ఆ ఇంట్లోనే ఉండటం లేదు అంత బిల్లు ఎలా వస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు. ఆ బిల్లు చూసి నేను ఒక్కసారిగా షాకయ్యా.
సోదరీమణులారా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళాలి.ఈ తోడేళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.