బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana ranaut) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, ఆయనతో ఒక సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో మాట చెప్పేసింది. తాజాగా ఆమె లీడ్ రోల్ లో నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ చంద్రముఖి2(Chandramukhi2). రాఘవ లారెన్స్(Raghava lawrence) హీరోగా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.
ALSO READ : గూగుల్ మ్యాప్ రివ్యూస్ అంటే పార్ట్ టైం జాబ్.. రూ.3 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్..తెలుగులో ఒక సినిమా చెయ్యాలంటే ఎవరితో చేస్తారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని అడగగా.. దానికి సమాధానంగా కంగనా.. నేను రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు రామ్ చరణ్, రాజమౌళితో కలిసి ఒక సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.