బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హిందీలో ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనా మెయిన్ లీడ్ పాత్రలో నటించడమేకాకుండా దర్శకత్వంతోపాటూ నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఎమర్జెన్సీ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మత విద్వేషాలు రచ్చగెట్టేవిధంగా ఉన్నాయని, అలాగే అభ్యంతరకరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయని విడుదల ఆగిపోయింది.
దీంతో ఈ చిత్ర సెన్సార్ వ్యవహారం కోర్టు వరకూ వెళ్ళింది. ఈ క్రమంలో సెన్సార్ సర్టిఫికేట్‌ను విడుదల చేయాలని కోరుతూ ఎమర్జెన్సీ చిత్ర నిర్మాతలు, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
ALSO READ | Oscar 2025: లాపతా లేడీస్ తర్వాత ఆస్కార్కి మరో బాలీవుడ్ మూవీ.. కానీ, ఒక ట్విస్ట్
సెన్సార్ వివాదంలో ఇరువురి వాదనలు విన్న ముంబై హైకోర్టు 'ఎమర్జెన్సీ'ని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రివిజన్ కమిటీ సిఫార్సు చేసినంత వరకు అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించి విడుదల చేయవచ్చని తెలిపింది. ఈ విషయం కంగనా రనౌత్ కి కొంతమేర ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు.
ఈ విషయం ఇలా ఉండగా 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయటంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రంపై పంజాబ్ రాష్ట్రంలోని సిక్కులు పలు అభ్యంతరాలు తెలియజేశారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ చిత్ర విడుదల నిలిపివేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఎమర్జెన్సీ వివాదం కంగనా రనౌత్ కి తలనొప్పిగా మారింది.