Kanguva OTT: కంగువ థియేటర్ వసూళ్ల కంటే బెటర్‌గా ఓటీటీ ధర.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?

Kanguva OTT: కంగువ థియేటర్ వసూళ్ల కంటే బెటర్‌గా ఓటీటీ ధర.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే?

కమర్షియల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేస్తూ తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సూర్య 42(Suriya42) వ చిత్రం కంగువ(Kanguva). సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది.

దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి వరల్డ్ వైడ్గా రూ.105-110 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇండియా వైడ్గా రూ.80.11 కోట్ల మేరకు కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చూపిస్తున్నాయి.

అంటే, ఈ లెక్కని బట్టి చూస్తే.. తమిళ సినిమా చరిత్రలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా కంగువ నిలిచేలా అందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 14న రిలీజైన ఈ మూవీ ఇప్పటికే చాలా థియేటర్స్లో నుంచి తీసేశారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అయితే, రిలీజైన 7 రోజుల్లోనే కనిపించకుండా పోయింది. 

Also Read :- చరణ్ నెవ్వర్ బిఫోర్ మాస్ లుక్.. డైరెక్టర్ బుచ్చిబాబు ఫోటో షేర్

అయితే, ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్స్ కి వచ్చి కలెక్ట్ చేసిందాని కంటే.. ఓటీటీలోనే బెటర్ అమౌంట్ దక్కించుకుందట. ఈ సినిమాకి ముందు నుంచి ఉన్న హైప్.. సూర్య నట విశ్వరూపంపై నమ్మకం.. దానికితోడు నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా ఓ ఇంటర్వ్యూలో కచ్చితంగా కంగువ రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని ధీమా.. అంతేకాదు.. మీరు రూ.1000 కోట్ల మార్క్‌తో ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు" అనే ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు! ఇలా చూసుకుంటే చాలానే ఉన్నాయి.

అయితే, ఓటీటీ విషయంలో మాత్రం ఈ మాటలు, సినిమా విజువల్స్ భారీ ధరకు అమ్ముడయ్యేటట్లు చేసేలా చేసింది. కాగా ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.80 కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం.. థియేట్రికల్ రన్తో కంగువ ఫెయిల్ అవ్వడంతో వీలైనంత త్వరగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే కంగువ మూవీ డిసెంబర్ 13న డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందట.  దీనిపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 8 భాషల్లో రిలీజైన కంగువా సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోనుందో చూడాలి.