కాలం కంటే విధి బలమైనది .. కంగువ సెకెండ్ లుక్‌‌ రిలీజ్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య. త్వరలో ‘కంగువ’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌‌ సినిమాపై అంచనాలు పెంచగా, సంక్రాంతి రోజున సూర్య సెకెండ్ లుక్‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో  సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు మరో క్యారెక్టర్‌‌‌‌లోనూ సర్‌‌‌‌ప్రైజ్ చేస్తున్నాడు.  ‘కాలం కంటే విధి బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్.. కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే.. కంగువ’ అంటూ ఈ పోస్టర్‌‌‌‌కు క్యాప్షన్ ఇవ్వడం  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సూర్య కెరీర్‌‌‌‌లో ఇది 42వ చిత్రం. తనకు జంటగా దిశాపటానీ నటిస్తుండగా బాబీడియోల్ కీ రోల్‌‌ చేస్తున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో  త్రీడీ ఫార్మట్‌‌లో రూపొందిస్తున్నారు.