
బెనోని : అండర్–19 టీమ్‌లో నుంచి ఇద్దరు ప్లేయర్లైనా టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తారని కోచ్ హృషికేష్ కనిత్కర్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ‘యంగ్ ఇండియాకు మంచి ఫ్యూచర్ ఉందని కచ్చితంగా చెప్పగలను. బ్యాటింగ్, బౌలింగ్‌లో నుంచి కనీసం ఇద్దరైనా టీమిండియాకు ఆడతారు. టోర్నీలో వాళ్ల పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు చూపిన పరిణతి అమోఘం. ఇండియన్ క్రికెట్‌కు ఇది చాలా మంచిది.
రాబోయే రోజుల్లో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెరుగుతాయి’ అని కనిత్కర్ పేర్కొన్నాడు. ప్రతీసారి ఐపీఎల్, టీమిండియా వైపు ఒకరిద్దరు కుర్రాళ్లు అడుగులు వేస్తుంటారన్నాడు. అయితే స్వదేశంలో ప్లేయర్ల మధ్య పోటీ కూడా చాలా ఎక్కువగా ఉందన్నాడు. ఈ టోర్నీ కోసం కుర్రాళ్లు చేసిన ప్రయాణం చాలా గొప్పదని పేర్కొన్నాడు.