హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్

ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని ఢిల్లీ ల్యాండ్ ఆర్డర్ స్పెషల్ సీపీ సాగర్ పి హుడా తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. సీసీ ఫుటేజీ. డిజిటల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. FSL అధికారుల సాయం కూడా తీసుకుంటున్నామని.. నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. 

కారుతో స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టి దాదాపు 10 నుంచి 12కి.మీ లాక్కెళ్లారని చెప్పారు. నిందితులు డ్రింక్ చేసి ఉన్నారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే ఏం జరిగిందనే దానిపై మరింత క్లారిటీ వస్తుందని సీపీ సాగర్ పి హుడా అన్నారు.