ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపూర్ అటవీ ప్రాంతంలో కంకణ శిల బయపడింది. ఈ శిల ఆరు వేల ఏండ్ల కిందటిదిగా కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చీడం రవి తెలిపారు.
ఈ రాతి పరికరాన్ని తవ్వుకోల మీద బరువుగా, వలలను ముంచే బరువుగా, పూసలను మెరుగుపెట్టడానికి ఉపయోగించేవారని పరిశోధక బృందం కన్వీనర్ హరగోపాల్ చెప్పారు.