
కన్నడలో మాస్ హీరోగా పేరుతెచ్చుకున్న దునియా విజయ్.. బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. తాజాగా తను మరో తెలుగు ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న చిత్రంలో విజయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ఇందులో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ చెప్పారు.
ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఇంపార్టెంట్ రోల్ పోషించనుందని ఇప్పటికే ప్రకటించగా, తాజాగా దునియా విజయ్‌ను కూడా తీసుకోవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఇతర నటీనటులు టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానుంది.