కన్నడ నటుడు నితిన్ గోపి ఇక లేరు. 39 ఏళ్ల ఈ యువ హీరో గుండెపోటుతో 2023 జూన్ 02న కన్నుముశారు. ఛాతీలో నొప్పి రావడంతో నితిన్ గోపి ఇబ్బందికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించకపోవడంతో నితిన్ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. నితిన్ అకాల మరణం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.
నితిన్ గోపికి ఇంకా పెళ్లి కాలేదు. బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. హలో డాడీ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, లెజెండరీ యాక్టర్ విష్ణువర్ధన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు నితిన్ . ఈ సినిమా ఆయనకు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. పలు సీరియల్స్‌లో కూడా ఆయన నటిస్తున్నారు.
కాగా ఇప్పటికే గుండెపోటు కారణంగా శాండల్‌వుడ్ పరిశ్రమ పునీత్ రాజ్‌కుమార్, లక్ష్మణ్, మన్‌దీప్ రాయ్, బుల్లెట్ ప్రకాష్‌తో సహా పలువురు నటులను కోల్పోయింది.