
బెంగళూరు: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నెల 4న అరెస్టు చేసిన తర్వాత పోలీసులు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు నుంచి రూ.12.56 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి.. రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.