తిరుపతి: కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆయన వేద చిత్ర యూనిట్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల శివరాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తాను నటించిన వేద సినిమా 23న మూడు భాషల్లో విడుదల కాబోతోందని వెల్లడించారు. వేద సినిమా మహిళలకు బాగా నచ్చే అవకాశం ఉందని చెప్పారు.
వేద సినిమా మూడు వేర్వేరు కాలాల్లో నడిచి ఉత్కంఠ రేపుతుందని తెలిపారు. వినూత్న రీతిలో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా చిత్రీకరించిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని కన్నడ నటుడు శివరాజ్ కుమార్ అన్నారు.