టాలీవుడ్‌‌కు పరిచయం కాబోతున్న మరో కన్నడ బ్యూటీ

టాలీవుడ్‌‌కు పరిచయం కాబోతున్న మరో కన్నడ బ్యూటీ

మహేష్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ సంస్థ,  రాస్ర ఎంటర్‌‌‌‌టైన్మెంట్​తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ఏ రోజైతే చూశానో నిన్ను’.  రాజు బొనగాని దర్శకుడు. చెక్, బుర్రకథ, రంగ రంగ వైభవంగా సినిమాల్లో చైల్డ్ హీరోగా నటించిన భరత్ రామ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా హీరోయిన్‌‌ పేరును రివీల్ చేశారు. చార్లీ 777, జాగ్వార్ లాంటి కన్నడ చిత్రాలతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య గౌడ ఈ చిత్రంతో హీరోయిన్‌‌గా టాలీవుడ్‌‌కు పరిచయం అవుతోంది.  డిసెంబర్‌‌‌‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు.