
బెంగళూరు: అక్రమంగా బంగారు బిస్కెట్లు తరలిస్తూ బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్‌ఎయిర్‌పోర్టులో అధికారులకు పట్టుబడ్డ కన్నడ సినీ నటి రన్యా రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. అధికారులకు ఇచ్చిన స్టేట్మెంట్లో తాను 17 బంగారు కడ్డీలను అక్రమంగా తీసుకొచ్చినట్లు అంగీకరించారని సమాచారం.
తన అంతర్జాతీయ ప్రయాణాల గురించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)కు చెప్పారు. దుబాయ్ తో పాటు అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరప్, సౌదీ అరేబియాకు కూడా గతంలో వెళ్లి వచ్చినట్లు తెలిపారు.
మరోవైపు, నటి రన్యా రావును డీఆర్‌ఐకు మూడ్రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు
శుక్రవారం తీర్పు వెలువరించింది.