మీరు చావాలనుకుంటే చచ్చిపోండి : నటి శోభిత సూసైడ్ నోట్ ఎవరి గురించి..?

మీరు చావాలనుకుంటే చచ్చిపోండి : నటి శోభిత సూసైడ్ నోట్ ఎవరి గురించి..?

కన్నడ సీరియల్​నటి శోభిత శివన్న ఆత్మహత్య సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నవంబర్ 30న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లోని  కొండాపూర్ శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన ఇంట్లో బెడ్రూంలో  శోభిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  డిసెంబర్ 2న  బెంగళూరు నుంచి వచ్చిన శోభిత కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో  కేసు నమోదు చేసుకున్న పోలీసులు  కొండాపూర్ లోని శోభిత ఇంట్లో  పరిశీలించగా సూసైడ్ నోట్ లభ్యం అయింది.  పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు.  మీరు చావాలనుకుంటే చనిపోండి (సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్) అని లేఖలో రాసి ఉందని పోలీసులు తెలిపారు.  అయితే శోభిత ఎవరిని ఉద్దేశించి రాసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత  డిఫ్రెషన్ లో  ఉన్నారా? భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సాఫ్ట్ వేర్ సుధీర్ రెడ్డితో పెళ్లి..

కర్నాటకలోని హసన్ జిల్లా సక్లేశ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన శోభిత(32) కన్నడలో పాపులర్ సీరియల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు ​పలు సినిమాల్లో నటించింది.పెండ్లి తర్వాత యాక్టింగ్‌‌‌‌‌‌‌‌కు గుడ్ బై చెప్పిన శోభిత.. కొండాపూర్ శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన భర్తతో కలిసి ఉంటోంది. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ మ్యాట్రిమోనీ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో శోభితతో సుధీర్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి 2023 మే 21న వారు పెండ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నారు. సుధీర్ రెడ్డి హైటెక్ సిటీలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ జాబ్​చేస్తున్నాడు. ఇటీవల తెలుగు సీరియల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు సినిమాల్లో అవకాశాల కోసం శోభిత ప్రయత్నాలు చేస్తోంది. 

Also Read :- పెళ్లైన ఏడాదికే నటి శోభిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది..?

నవంబర్ 30న రాత్రి 10 గంటల సమయంలో భర్తతో కలిసి భోజనం చేసిన శోభిత.. తన బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయింది. మరో బెడ్‌‌‌‌‌‌‌‌ రూంలో సుధీర్​రెడ్డి తన ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వర్క్ చేసుకుంటూ అందులోనే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పనిమనిషి వచ్చి శోభిత బెడ్ రూం డోర్​కొట్టగా, ఆమె ఓపెన్​ చేయలేదు. దీంతో సుధీర్ రెడ్డి డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, శోభిత ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శోభిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.