బిగ్ బాస్ అయితే ఏంటీ.. హౌస్ లోకి వచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

కన్నడ బిగ్‌బాస్‌ సీజన్‌-10  కంటెస్టెంట్‌ వర్తూరు సంతోష్‌  అరెస్ట్ అయ్యారు. హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సంతోష  పులిగోరు లాకెట్  ధరించి హౌస్‌ లోపలికి వెళ్లడంతో పలువురు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.  ఈ క్రమంలో  అటవీశాఖ అధికారులు  అతనిపై కేసు నమెదు చేసి హౌస్‌ లోపలికి వెళ్లి మరీ సంతోష్ ను అరెస్ట్ చేశారు. దీంతో  సంతోష్ ను  అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. బిగ్‌బాస్‌ రియాల్టీ షో చరిత్రలో, అదీ హౌస్‌లో  ఓ కంటెస్టెంట్ అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.   

సంతోష్‌ ప్రస్తుతం రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఊల్లఘించిన సంతోష్ పై కేసు నమోదు చేసిన అధికారులు..  పులిగోరును కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.  విచారణ అనంతరం కోర్టులో సంతోష్ ను హాజరు పరుస్తామని బెంగుళూరు ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవీంద్ర వెల్లడించారు.  ఒకవేళ ఈ నేరం రుజువైతే  సంతోష్‌  కు  3 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. 10,000 నుంచి 25,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

ALSO READ :-  ODI World Cup 2023: ఆ ఓటమితో ధోనీ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు: సంజయ్ బంగర్