కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జగద్గురు పీఠం సమీపంలో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. టీ స్టాల్ యజమానితో గొడవ పడి దాడి చేశారు. వాటర్ బాటిల్ రేటు విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కన్నడ భక్తులు షాపులోని వస్తువులను రోడ్డుపై విసిరేసి నిప్పు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. అంతే కాకుండా తెలుగు వాళ్లు కనిపించగానే విచక్షణరహితంగా కొట్టారని తెలిపారు. స్దానికులను భయబ్రాంతులకు గురయ్యేలా కర్రలు పట్టుకుని రోడ్లపై అరుచుకుంటూ తిరిగారని అంటున్నారు. కనపడినవారిని కనపడినట్లు చితకబాదారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క షాపుతో ఆగకుండా ఇతర షాపులకు కూడా నిప్పు పెట్టారని స్థానికులు అంటున్నారు. కన్నడ భక్తుడిని షాపు యజమాని గొడ్డలితో తలపై కొట్టాడు. దీంతో వివాదం మరింత ముదిరింది. సమాచారం అందుకున్న డీఎస్పీ శృతి రంగంలోకి దిగి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకచ్చారు.