కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ప్రముఖ డైరెక్టర్ మృతి

కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ప్రముఖ డైరెక్టర్ మృతి

కన్నడ ప్రముఖ దర్శకుడు దీపక్ అరస్ అనారోగ్యంగా కారణంగా మృతి చెందారు. గత కొన్ని రోజులుగా దర్శకుడు దీపక్ కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో డయాలసిస్ తోపాటూ ఇతర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో గురువారం (అక్టోబర్ 17) రాత్రి 7 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని దీపక్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో పలువురు బంధువులు, స్నేహితులు, అభిమానులు దీపక్ కుటుంబాన్ని సానుభూతి తెలియస్తున్నారు.

అయితే ర్శకుడు దీపక్ అరస్ సోదరి అమూల్య కూడా కన్నడ సినీ పరిశ్రమలో బాగానే రాణిస్తోంది. 'మానసాలజీ' మరియు 'షుగర్ ఫ్యాక్టరీ'  చిత్రాలకు  దీపక్ అరస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలు ఫర్వాలేదనిపించడంతో ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటూ  నిలదొక్కుకుంటుండగా అనారోగ్య సమస్యలు తెలెత్తాయి. దీంతో మంచి భవిష్యత్ ఉన్న డైరెక్టర్ దీపక్ అరస్ మధ్యలోనే తనువు చాలించాడు.