రష్మిక ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న కన్నడ ఫ్యాన్స్... ఎందుకంటే..?

రష్మిక ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న కన్నడ ఫ్యాన్స్...  ఎందుకంటే..?

నేషనల్ క్రష్ రష్మిక వివాదంలో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన 'ఛావా'తో మరో విజ యాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు తాజాగా కన్నడవాసులు ఆగ్రహానికి గురైంది. ప్రమోషన్లో భాగంగా ముంబైలో జరిగిన ఓ ప్రోగ్రాం ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా 'ఉంది' అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె వ్యాఖ్యలపై ప్రస్తుతం కర్నాటకలో చర్చకు దారితీశాయి. 

రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నడవాసులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 'విరాజ్పేట్ (రష్మిక సొంతూరు) హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చింది? ఈ విషయం మాకు తెలియలేదు', 'వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు సొంతూరు గురించి చెప్పడానికి వచ్చిన సమస్య ఏమిటి?' అంటూ పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా, రష్మిక ఇలా ట్రోలింగ్స్ ఎదుర్కోవడం ఇది రెండోసారి.

కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆ తర్వాత "ఛలో" మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తెలుగులో వరుస విజయాలను అందుకున్న ఈ బ్యూటీ పుష్పతో నేషనల్ హీరోయిన్ గా మారారు. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వరుస సినిమాల్లో నటించే అవకాశం సంపాదించుకుంటూ దూసుకుపోతోంది.