AT Raghu: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ఆ రెబల్ స్టార్ 27 సినిమాలకు డైరెక్షన్

AT Raghu: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. ఆ రెబల్ స్టార్ 27 సినిమాలకు డైరెక్షన్

ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు ఎ.టి. రఘు (76) కన్నుమూశారు. ఆర్టీ నగర్ లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు (మార్చి 21న) మధ్యాహ్నం హెబ్బల్ శ్మశానవాటికలో రఘు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

ఎ.టి. రఘు గత 55 సంవత్సరాలుగా కన్నడ చిత్ర పరిశ్రమలో రచయిత, దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఆయన దాదాపు 55 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఆయన కన్నడ స్టార్ హీరో అంబరీశ్ 27 సినిమాలు చేశారు. రెబల్ స్టార్ అంబరీష్ను సూపర్ స్టార్గా నిలబెట్టడంలో ఎ.టి. రఘు కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఎ.టి. రఘు సినీ ప్రస్థానం:

ఎ.టి. రఘు 1980లో 'న్యాయ నీతి ధర్మ' అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రజనీకాంత్ నటించిన బాలీవుడ్ మూవీ 'మేరీ అదాలత్' కు కూడా ఏ.టి. రఘు దర్శకత్వం వహించారు. ఇది ఆయన కన్నడలో డైరెక్ట్ చేసిన 'ఆశ' కి రీమేక్. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారాడు.

ఆయన 'ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్', 'పుట్ట హెండ్తి', 'మైసూర్ జాన్', 'మాండ్యాద గండు', 'మిడిద హృదయగలు', 'అంతిమ ప్రియ', 'నాయతక్తే నానో', 'పద్మవ్యూహ', మరియు 'సూర్యోదయ' వంటి అనేక ప్రసిద్ధ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తానా నేను, మాండ్యాద గండు, కాడిన రాజా, మరియు మైసూర్ జానా చిత్రాలు భారీ విజయాలను సాధించాయి.