Toxic Controversy: యశ్ టాక్సిక్ షూటింగ్ కోసం అడవిలోని చెట్లు నరికేశారా..?

Toxic Controversy: యశ్ టాక్సిక్ షూటింగ్ కోసం అడవిలోని చెట్లు నరికేశారా..?

స్టార్ హీరో యశ్‌(Yash) కెరిర్ లో 19వ సినిమాగా టాక్సిక్ (Tixic) అనే మూవీ వస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) డైరెక్ట్ చేయబోతున్నారు.

భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కోసం.. చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు వస్తుండటంతో వివాదంలో చిక్కుకుంది. బెంగళూరు లోని ప్రస్తుతం పీఎస్‌యూ హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) ల్యాండ్స్‌లో షూటింగ్ స్టార్ట్ చేసిన టాక్సిక్ మేకర్స్ ఇక్కడ భారీ సెట్‌ను వేశారు. పీణ్య సమీపంలో ఉన్న ఈ హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ జరిగింది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆ భూమిలో ఉన్న చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వాధికారులు అక్కడ దిగారు. గతంలో శాటిలైట్‌ చిత్రాలను.. ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించగా..భారీ స్థాయిలో చెట్లు నరికేసినట్లు అధికారులు నిర్థారించుకున్నారు. 

ఈ క్రమంలో అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే స్పందించి.. టాక్సిక్‌ మూవీ షూటింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. చెట్లు నరికివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ కోసం అటవీ భూమిలో ఉన్న వందలాది చెట్లను నరికివేశారని.. అందుకు అనుమతించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంగళవారం (అక్టోబర్ 29న) తన శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Also Read : అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు బెయిల్


అటవీశాఖ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేయడం నేరమన్నారు మంత్రి ఈశ్వర్ ఖండ్రే.

ఈ నేప‌థ్యంలో ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు. విషయం తెలుసుకున్న నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మేకర్స్ పై మండిపడుతున్నారు. అసలు పచ్చటి చెట్లని నరికివేసి.. సినిమాలు తీయడమేంట్రా..అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. 'ఇది పాన్ ఇండియా సినిమా కాదు.. పాన్ ఇండియా నరకుడు' అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.