Darshan: సూసైడ్ చేసుకున్న కన్నడ హీరో దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటంటే?

Darshan: సూసైడ్ చేసుకున్న కన్నడ హీరో దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటంటే?

రేణుకాస్వామి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే కన్నడ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రియురాలు పవిత్ర కోసమే ఈ హత్య చేయించడంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటె తాజాగా హీరో దర్శన్ మేనేజర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్     శ్రీధర్ మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలోనే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

ఇక ఆత్మహత్త్య సమయంలో సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం కూడా లభించాయి. ఒంటరితనం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని, దీనికి తన బందువులకు, స్నేహితులకు గానే ఎలాంటి సంబంధం లేదని  నోట్, వీడియోలో తెలిపారు శ్రీధర్. అయితే.. దర్శన్ కేసు నడుస్తున్న సమయంలోనే ఆయన మేనేజర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం పోలీసులకు అనుమానాల్ని కలిగిస్తోంది. అందుకే శ్రీధర్ ఆత్మహత్యకి రేణుకస్వామి హత్యకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.