టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ప్రభాస్ సినిమాలకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తోపాటు మార్కెట్ ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు అన్నీ మినియం రూ.200 కోట్లు బిజినెస్ చేశాయి. అయితే ప్రభాస్ వ్యక్తిత్వానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు.
ఇందులోభాగంగా ప్రభాస్ కి ఏమాత్రం గర్వం ఉండదని అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాడని తెలిపాడు. అలాగే ప్రభాస్ చాలా కూల్ గా ఉంటాడని ఈ క్రమంలో సినిమా రిజల్ట్స్ తో పనిలేకుండా ఎప్పుడూ ఒకేలా రియాక్ట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. సింపుల్ మరియు మంచి వ్యక్తి అంటూ ప్రశంసించాడు.
Also Read :- రజినికాంత్ సూపర్ హిట్ సీక్వెల్ సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్
ఈ విషయం ఇలా ఉండగా కిచ్చ సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఈ సినిమాకి కన్నడ స్టార్ డైరెక్టర్ విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించగా వరలక్ష్మి శరత్‌కుమార్, సంయుక్త హోర్నాడ్, సుకృత వాగ్లే మరియు అనిరుధ్ భట్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.వి క్రియేషన్స్‌పై కలైప్పులి ఎస్. థాను, కిచ్చా క్రియేషన్స్‌పై సుదీప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రముఖ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు.
ఇక ప్రభాస్ విషయానికొస్తే తెలుగులో కల్కి 2898AD పార్ట్ 2, సలార్ 2, ది రాజాసాబ్ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ది రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.