
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూతురు సాన్వి సుదీప్ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం రెడీ అవుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది సాన్వి శాండిల్ వుడ్ లో ఈ అమ్మడి ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే సాన్వి కూడా ఈ విషయం గురించి ఇటీవలే స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులోభాగంగా ప్రస్తుతం తన ఎంట్రీ కోసం సిద్దమవుతున్నానని హీరోయిన్ పాత్రలు లేదా ఇతర పాత్రలకి తగట్టుగా యాక్టింగ్ లో మెళుకువలు నేర్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే మొదట్లో తనకి యాక్టింగ్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదని దీంతో సింగింగ్ ట్రై చేద్దామనుకున్నానని కానీ తన తండ్రి కిచ్చ సుదీప్ ని చూసిన తర్వాత నటనపై మనసు మళ్లిందని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకి స్టోరీ రైటింగ్, స్క్రేన్ ప్లే రైటింగ్, దర్శకత్వంపై కూడా ఆసక్తి ఉందని కానీ మెయిన్ ప్రియారిటీ మాత్రం యాక్టింగ్ అని తెలిపింది.
ప్రస్తుతం తాను ఓవర్ వెయిట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాని అందుకే బరువు తగ్గే పనిలో ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటుగా హైదరాబాద్ లో తన యాక్టింగ్ కోర్సు కి సంబందించి 4 నెలలపాటు వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నట్లు వెల్లడించింది. ఇక తన తండ్రితోపాటూ కజిన్ బ్రదర్స్ కూడా ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారని దీంతో తన నుంచి ఆడియన్స్ కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేస్తారని కాబట్టి వారి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకు సాధ్యమైనంతవరకూ ట్రై చేస్తానని తెలిపింది.. దీంతో సుదీప్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీవర్ అవుతున్నారు..
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే హీరో సుదీప్ తన మేనళ్లుడు సంచిత్ సంజీవ్ ని హీరోగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇందులోభాగంగా సుదీప్ స్క్రీన్ నేమ్ అయిన కిచ్చ ని సంచిత్ కి ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సంచిత్ మొదటగా "జిమ్మీ" అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం కావాలనుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా నటించడంతోపాటూ డైరెక్షన్ కూడా చెయ్యాలనుకున్నాడు.. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో తన మేనళ్లుడి లాంచింగ్ బాధ్యతలని హీరో సుదీప్ తీసుకున్నట్లు సమాచారం..