కన్నడ ప్రముఖ హీరో రిషభ్ శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడు. కాగా రిషభ్ శెట్టి గతంలో హీరోగా నటించిన కాంతార చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కోట్ల రూపాయలు వసూళ్లు సాధించింది. దీనికితోడు రిషభ్ శెట్టికి టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉండటంతో మంచి సపోర్ట్ ఇస్తున్నారు.
ఇటీవలే రిషభ్ శెట్టి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతోంది. దీంతో రిషభ్ శెట్టి కెరీర్ కి మంచి ప్లస్ కానుంది. అయితే రిషభ్ శెట్టి మరో తెలుగు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read :- గేమ్ ఛేంజర్ లో మరో టాలీవుడ్ హీరో..
ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే చిత్రంలో హీరో హీరోయిన్లు ఎవరనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాంతర చిత్రం పెద్ద హిట్ అవ్యవడంతో రిషభ్ శెట్టి రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రిషభ్ శెట్టి కన్నడ లో కాంతార 2 చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.